తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోగిపై దాడి.. ఆపై దారుణ హత్య.. మర్మాంగాన్ని పైపులో పెట్టి.. - కర్ణాటక క్రైమ్ న్యూస్

డీ అడిక్షన్​ సెంటర్​లో చికిత్స పొందుతున్న యువకుడిని దారుణంగా కొట్టి చంపారు నిర్వాహకులు. అనంతరం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ యువకుడి కుటుంబ సభ్యులను నమ్మించారు. ఈ అమానవీయ ఘటన గుజరాత్​ పటాన్​లో జరిగింది. మరో ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి రెండు అంతస్తుల భవనం నుంచి కిందపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

patient killed in de addiction centre
patient killed in de addiction centre

By

Published : Mar 11, 2023, 4:21 PM IST

గుజరాత్​ పటాన్​లో అమానవీయ ఘటన జరిగింది. డీ అడిక్షన్​ సెంటర్​లో చికిత్స పొందుతున్న యువకుడిని దారుణంగా కొట్టి చంపారు నిర్వాహకులు. అనంతరం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ యువకుడి కుటుంబసభ్యులను నమ్మించారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..
సర్దార్ కాంప్లెక్స్​లో సూరత్​కు చెందిన జ్యోన​ ఛారిటబుల్​ ట్రస్ట్​ 9 నెలలుగా డీ అడిక్షన్​ సెంటర్​ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సెంటర్​లో సుమారు 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 6 నెలల క్రితం హార్దిక్ రమేశ్ భాయ్​ అనే వ్యక్తి డీ అడిక్షన్​ సెంటర్​లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే హార్దిక్ చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 17న హార్దిక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు నిర్వాహకులు. దీనిని నమ్మిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లి ఖననం చేశారు. కానీ అతడి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన బంధువు చంద్రకాంత్ భాయ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్వాహకుడు సందీప్​ పటేల్​ సహా ఆరుగురు.. హార్దిక్​ను దారుణంగా కొట్టడం వల్లే మరణించాడని తేలింది. హార్దిక్​ను కొట్టడమే కాకుండా అతడి మర్మంగాన్ని పైపులతో మెలితిప్పారు. దీంతో హార్దిక్​ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అప్రమత్తమైన నిర్వాహకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో 9 మంది నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. డీ అడిక్షన్​ సెంటర్​ను మూసివేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా.. నాలుగు రోజుల కస్టడీని విధించింది కోర్టు.

రెండో అంతస్తు నుంచి జారిపడిన మూడేళ్ల బాలుడు..
మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి భవనం రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది
కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన శివప్ప, అంబిక భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శివప్ప మేస్త్రీ పని చేస్తూ.. కెంగేరీ సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం అంబిక చిన్నారికి పాలు ఇస్తుండగా.. బాలుడు బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి జారి కిందపడిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

ఇవీ చదవండి :హోలీ రోజు జపాన్ యువతితో అనుచిత ప్రవర్తన.. నిందితులు అరెస్ట్

మోదీ కాన్వాయ్​ కమాండో మృతి.. కాలువలో పడ్డ 20 గంటల తర్వాత..

ABOUT THE AUTHOR

...view details