కొవిడ్ ఒకసారి సోకిన యువతకురెండోసారి సోకకుండా ఉండే అవకాశం..ఏమీ లేదని, రోగనిరోధకవ్యవస్థ మెరుగుపరుచుకునేందుకు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలనిపరిశోధకుల పరిశీలనలో తేలింది. ఈ మేరకు లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో కథనంప్రచురితమైంది.
అమెరికా నావీలోని ఉద్యోగులలో(18-20ఏళ్లు) 2,346 మందిపై 2020 మే నుంచి నవంబర్ మధ్య అధ్యయనం చేసింది. టీకా వేసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరిగి.. కరోనా సోకే అవకాశం ఉండదని వెళ్లడించింది.
అందులో 189మందికి మొదటి సారి కరనా సోకింది. 2,247 మందికి కరోనా నెగటివ్ అని తేలింది. అయితే వారిపైనే కొన్ని రోజుల తర్వాత కరోనా పరీక్షలు జరపగా మొదటి సారి కరోనా సోకిన 189మందిలో 19మందికి(10శాతం) రెండోసారి కరోనా సోకింది. మొదటి సారి కరోనా సోకనివారు, సోకిన వారు అందరికీ కలిపి 1,079 మందికి రెండో సారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.
వ్యాక్సినేషన్అత్యావశ్యకం అని తేల్చినట్లు పరిశోధకులు తెలిపారు. వ్యాక్సినేషన్ కాకుంటే.. యువతకుకరోనా సోకి ఇతరులకు కూడా సంక్రమించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'భారత్‌కు 5 లక్షల ఐసీయూ పడకలు అవసరం'