బిహార్లోని పట్నా ఎయిర్పోర్ట్ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో(6e 2126) ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని అందర్నీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో వెంటనే అధికారులు.. విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్.. బ్యాగ్లో బాంబు ఉందంటూ.. - bomb in flight
పట్నా నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు.. తన బ్యాగులో బాంబు ఉందని చెప్పి హల్చల్ సృష్టించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఎయిర్పోర్ట్కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.
airport bomb
వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. హుటాహుటిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నిపుణులు, పోలీసులు విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:డిప్యూటీ కలెక్టర్కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు