దుబాయ్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై విమాశ్రయంలో బుధవారం జరిగింది. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. రూ.19.79 లక్షలు విలువ చేసే సౌదీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
సేమియా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ-ఎయిర్‌పోర్ట్‌లో పట్టివేత
చెన్నై ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సౌదీ అరేబియా కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సేమియా ప్యాకెట్లలో దుబాయ్‌కు ఈ కరెన్సీకి తరలిస్తున్న క్రమంలో నిందితుడు అధికారులకు పట్టుబడ్డాడు.
విదేశీ కరెన్సీ
సేమియా ప్యాకెట్లలో దుబాయ్‌కు ఈ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు నిందితుడు ప్రయత్నించాడని అధికారులు వెల్లడించారు. విదేశీ డబ్బుకు సంబంధించి నిందితుడు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :Flights Ban: అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన