తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం - మధ్యప్రదేశ్ సీధీ జిల్లా వార్తలు

bus accident in MP
బస్సు ప్రమాదం

By

Published : Feb 16, 2021, 9:21 AM IST

Updated : Feb 16, 2021, 7:24 PM IST

16:54 February 16

47కి చేరిన మృతులు..

మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 47కి చేరింది. సహాయక చర్యలు ముగిశాయని తెలిపారు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొలుత 18మంది మృతిచెందినట్టు వార్తలు వచ్చినప్పటికీ సహాయక చర్యల్లో మరిన్ని మృతదేహాలను గుర్తించారు. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోవడంతో ఇంకొందరు గల్లంతయ్యారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. దీనిపై రేవా డివిజినల్ కమిషనర్‌ రాజేశ్‌ జైన్‌ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చామని చెప్పారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. 

15:56 February 16

రాష్ట్రపతి దిగ్భ్రాంతి..

మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

14:13 February 16

బస్సు ప్రమాదంపై మోదీ విచారం

మధ్యప్రదేశ్​లో బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు పరిహారం అందిస్తామని ప్రకటించారు.

14:02 February 16

మధ్యప్రదేశ్​ సీధీ జిల్లా పట్నా గ్రామం వద్ద కాలువలోకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. 

13:34 February 16

37 మృతదేహాలు వెలికితీత

కాలువలోకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఇప్పటివరకు 37 మృతదేహాలు వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

12:31 February 16

మధ్యప్రదేశ్​ సీధీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరింది.  కాలువలో పడి గల్లంతైన వారి కోసం అధికారులు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు.

11:58 February 16

28 మంది మృతి

ఘటనాస్థలం వద్ద దృశ్యాలు

మధ్యప్రదేశ్​ సీధీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 28కి చేరింది. కాలువలో పడి గల్లంతైన వారి కోసం అధికారులు యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు.

దాదాపు 60 మంది ప్రయాణికులతో కూడిన బస్సు సతానాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో పట్నా గ్రామం వద్ద అదుపు తప్పి వంతెనపై నుంచి కాలువలోకి పడిపోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. నీటి ఉద్ధృతికి వాహనం కొంత దూరం కొట్టుకుపోయి ఉంటుందని వారు చెప్పారు.

బస్సు కాలువలో పడిన వెంటనే ఏడుగురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 28 మంది మృతదేహాలు వెలికితీశారు.

09:17 February 16

లైవ్​: మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. దాదాపు 60 మంది యాత్రికులతో సతనాకు వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలోకి పడిపోగా ఈ దుర్ఘటన జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 

Last Updated : Feb 16, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details