పార్లమెంటులో ఓబీసీ బిల్లు ఆమోదం పొందడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అట్టడుగు వర్గాలవారికి గౌరవం, అవకాశం, న్యాయం అందించడంలో తమ ప్రభుత్వ నిబద్ధతతో పని చేస్తోందన్నారు.
"127వ రాజ్యాంగ సవరణ బిల్లు-2021 ఉభయ సభలు ఆమోదించడం ఓ మైలురాయి. ఈ బిల్లు సామాజిక సాధికారతను మరింత పెంపొందిస్తుంది. ఇది అట్టడుగు వర్గాల వారిగి గౌరవం, అవకాశం, న్యాయం అందించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అంటూ మోదీ ట్వీట్ చేశారు.