తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎల్​జేపీ లోక్​సభాపక్ష నేతగా కొత్త వ్యక్తి - పరాస్​ ఇంటికి పాసవాన్​

లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) లోక్​సభాపక్ష నేతగా పశుపతి కుమార్​ పరాస్ ఎన్నికయ్యారు. ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీల బృందం చిరాగ్​ పాసవాన్ స్థానంలో పరాస్​ను తమ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో.. అప్రమత్తమైన చిరాగ్​ పాసవాన్​ సోమవారం దిల్లీలోని పరాస్​ ఇంటికి చేరుకుని ఆయనతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Pashupati Kumar Paras
పశుపతి కుమార్ పరాస్​

By

Published : Jun 14, 2021, 2:46 PM IST

Updated : Jun 15, 2021, 10:47 AM IST

బిహార్​ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. లోక్ జనశక్తి పార్టీ(LJP) లోక్​సభాపక్ష నేతగా చిరాగ్​ పాసవాన్​ స్థానంలో ఆ పార్టీ ఎంపీపశుపతి కుమార్​ పరాస్​ ఎంపికయ్యారు. ఆరుగురు ఎంపీలున్న ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీలు పరాస్​ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎల్​జేపీకి చెందిన ఐదుగురు ఎంపీల బృందం... సోమవారం మధ్యాహ్నం లోక్​సభ స్పీకర్ ఓం బిర్లాను మరోమారు కలుస్తారని సమాచారం. స్పీకర్​తో పశుపతి కుమార్ పరాస్​ ఎంపిక గురించి మాట్లాడునున్నారని తెలుస్తోంది.

పరాస్​ ఇంటికి పాసవాన్​..

ఎల్​జేపీలో ఐదుగురు ఎంపీల వ్యతిరేకత నేపథ్యంలో చిరాగ్​ పాసవాన్ అప్రమత్తమయ్యారు. ​ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి దిల్లీలో తన బాబాయి అయిన ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్​ పరాస్​ ఇంటికి ఆయన సోమవారం చేరుకున్నారు. పాసవాన్​ సోదరుడు మరో ఎంపీ ప్రిన్స్​ రాజ్​ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరూ ఆయనను ఇంట్లోకి పిలవక పోవడం వల్ల గంట సేపు గేటు బయట కారులోనే ఉండిపోయారు. తరువాత ఇంట్లో గంట సేపు ఉన్నా వారిద్దరూ కలవలేదు. పరాస్ ఇంట్లో లేరని అక్కడి వారు చెప్పగా పాసవాన్​ నిరాశతో వెనుదిరిగారు.

ఇదీ చూడండి:చిరాగ్​ వేరుకుంపటే జేడీయూను ముంచిందా?

Last Updated : Jun 15, 2021, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details