తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా విడాకులకు భాజపానే కారణం!' - పశ్చిమ బెంగాల్

ముమ్మారు తలాక్ రద్దు చేసిన పార్టీ(భాజపా)నే విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రోత్సహిస్తోందని టీఎంసీ నేత సుజాతా మండల్ ఆరోపించారు. భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య అయిన సుజాత.. ఇటీవలే టీఎంసీలో చేరారు. పార్టీ మారినందుకే తనకు సౌమిత్ర విడాకులు ఇస్తున్నారని అన్నారు.

TMC's Sujata Mondal
సుజాతా మండల్

By

Published : Dec 23, 2020, 10:24 AM IST

ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్​లో చేరిన భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మండల్.. కాషాయ దళంపై తీవ్ర విమర్శలు చేశారు. ముమ్మారు తలాక్​ రద్దు చేసిన పార్టీనే.. విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పార్టీ మారినందుకే విడాకులు ఇస్తానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు ప్రవేశించడం ఆ బంధానికి మంచిది కాదు. భాజపాలోని చెడు వ్యక్తులతో సౌమిత్ర సహవాసం చేస్తున్నారు. ఆయన్ను నాకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు. ముమ్మారు తలాక్​ను నిషేధించిన పార్టీనే.. ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలని సౌమిత్రను అడుగుతోంది.

నేను ఇప్పటికీ సౌమిత్రను ప్రేమిస్తున్నా. ఆయనే నా భర్త అని సింధూరం ధరిస్తున్నా. ఒత్తిడి వల్ల, పార్టీపై ఉన్న నమ్మకాన్ని నిరూపించేందుకే పదేళ్ల బంధాన్ని ఆయన ముగిస్తున్నారు. మాది ప్రేమ వివాహం. ఒక్కరోజులో అది ఎలా ముగిసిపోతుంది?"

-సుజాతా మండల్, టీఎంసీ నేత

వ్యక్తిగత గౌరవం, భద్రతను దృష్టిలో ఉంచుకొనే టీఎంసీలో చేరినట్లు మండల్ తెలిపారు. భాజపాలో ఎలాంటి డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు. ఆ పార్టీలో తనకు సరైన మర్యాద లభించలేదని వెల్లడించారు. భార్యకు ఎందుకు విడాకులు ఇస్తున్నారని ఏ భాజపా నేత సౌమిత్రను అడగడం లేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:టీఎంసీలోకి భాజపా ఎంపీ భార్య- విడాకులు ఇస్తానన్న భర్త

ABOUT THE AUTHOR

...view details