తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీట్ల లెక్కలు ఫైనల్​- నామినేషన్లు షురూ - డీఎంకే పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును ఆగమేఘాలపై పూర్తి చేసుకున్నాయి ప్రధాన పార్టీలు. పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటించాయి. రెండు జాబితాల్లో మొత్తం 177 మంది పేర్లను ప్రకటించింది అధికార అన్నాడీఎంకే. భాజపాకు 20 సీట్లు కేటాయించింది. డీఎంకే 173 మందితో తమ జాబితాను ప్రకటించింది.

TAMILANADU
తమిళనాట ఆగమేఘాలపై సీట్ల సర్దుబాట్లు

By

Published : Mar 12, 2021, 6:08 PM IST

తమిళనాడులో సీట్ల సర్దుబాట్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించి నామినేషన్లు, ప్రచారాలపై దృష్టి సారించాయి ఆయా కూటముల్లోని పార్టీలు. శుక్రవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో సీట్ల కేటాయింపు చర్చలు పూర్తి చేసుకొని.. తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి.

173 మందితో బరిలో డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే. 173 మంది పేర్లు ప్రకటించింది. పార్టీలో పేరుపొందిన దురై మురుగన్​, కేఎన్​ నెహ్రూ, కే పోన్ముడి, ఎమ్​ఆర్​కే పన్నీర్​ సెల్వంతో పాటు దాదాపు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే స్టాలిన్​ ప్రాధాన్యమిచ్చారు.

డీఎంకే అధినేత స్టాలిన్​

ఎన్నికల బరిలో ఉదయనిధి స్టాలిన్​..

డీఎంకే అధినేత స్టాలిన్​ కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్​-ట్రిప్లికేన్​ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మార్చి 15న నామినేషన్​ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

కుమారుడు ఉదయనిధితో స్టాలిన్​

మిత్ర పక్షాలకు 61 సీట్లు..

తమిళనాడులో సీట్ల సర్దుబాటులో భాగంగా.. కన్యాకుమారి లోక్‌సభ స్థానం సహా 25 అసెంబ్లీ స్థానాలను.. కాంగ్రెస్​కు కేటాయించింది డీఎంకే. ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​-3, మణితనేయ మక్కల్​ కట్చి-2, వీసీకే-6, ఎండీఎంకే-6 స్థానాలు ఇచ్చింది. సీపీఎంతో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. డీఎంకే గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే.. ఈసారి 7 స్థానాలు తగ్గించుకొని బరిలో దిగుతోంది.

ఇదీ చూడండి:ప్రజా 'పరీక్ష'లో పళనిస్వామి పాస్​ అయ్యేనా?

ఏఐఏడీఎంకే- భాజపా కూటమి

అధికార అన్నాడీఎంకే, తన మిత్రపక్షం భాజపా మధ్య సీట్ల పంపకం ఇప్పటికే పూర్తి చేసింది. పలుమార్లు చర్చల అనంతరం కన్యాకుమారి లోక్​సభ స్థానం సహా 20 అసెంబ్లీ సీట్లను కమలదళానికి కేటాయించింది. ఈ క్రమంలోనే కన్యాకుమారి లోక్​సభ ఉపఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి పొన్​ రాధాకృష్ణన్​ను తమ అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.

తొలి జాబితాలో కీలక నేతలు..

శాసనసభ ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ఈనెల 5న ప్రకటించింది అన్నాడీఎంకే. అందులో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్​ సెల్వం పేర్లు ఉన్నాయి. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి పోటీ చేయనున్నారు. బోడినాయకనూర్​ నుంచి బరిలో దిగనున్నారు పన్నీర్​ సెల్వం.

171 మందితో రెండో జాబితా..

171 నియోజకవర్గాల నుంచి పోటీ పడే అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది అన్నాడీఎంకే. మిత్రపక్షాలైన పీఎంకేకు 23, భాజపాకు 20 సీట్లు కేటాయించింది. మూడో విడత జాబితా విడుదల చేసినప్పటికీ పద్మనాభపురం నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ కూటమిలో టీఎంసీకి ఆరు సీట్లు కేటాయించారు.

పన్నీరు సెల్వం నామినేషన్​..

తొలి రోజునే బోడినాయకనూర్​ నియోజకవర్గానికి నామినేషన్​ దాఖలు చేశారు అధికార ఏఐఏడీఎంకే కీలక నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం. పార్టీ నేతలతో కలిసి వెళ్లి రిటర్నింగ్​ అధికారికి నామపత్రాలు అందించారు.

నామినేషన్​ దాఖలు చేసిన పన్నీరు సెల్వం

ఇదీ చూడండి:శశికళ గుడ్​బై​: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?

ఎంఎన్​ఎం-ఏఐఎస్​ఎంకే-ఐజేకే కూటమి..

ఏప్రిల్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కమల్​ హాసన్​ నేతృత్వంలోని మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) పార్టీ.. ఆల్​ ఇండియా సమథువ మక్కల్​ కట్చి(ఏఐఎస్​ఎంకే, ఇండియా జననాయక కట్చి(ఐజేకే)తో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. 234 స్థానాలకు గానూ 154 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మిగతా 80 స్థానాల్లో మిత్రపక్షాలకు చెరో 40 సీట్లు కేటాయించింది.

కమల్​ హాసన్​ కోయంబత్తూర్​ సౌత్​ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

కోవిల్​పట్టు నుంచి బరిలో దినకరన్​..

ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్​

జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్​.. కోవిల్​పట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి జాబితాలో 15 మంది, రెండో జాబితాలో 50 మందితో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు దినకరన్​. మామాజీ ఎమ్మెల్యే పీ పలనిప్పన్​, ఎమ్​.రంగస్వామి, జీ సెంతమిళన్​, సీ షణ్ముగవేలు, ఎన్​జీ పార్థిబన్​ ఆ జాబితాలో ఉన్న ప్రముఖులు.

ఇదీ చూడండి:మహిళలకు డీఎంకే రూ.1000, అన్నాడీఎంకే రూ.1,500

ABOUT THE AUTHOR

...view details