తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరుగుతున్న కేసులు- ఔరంగబాద్​, ఠాణెలో మళ్లీ లాక్​డౌన్​ - ఔరంగబాద్​లో లాక్​డౌన్​

మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఔరంగబాద్​, జిల్లాలో మార్చి 11 నుంచి ఏప్రిల్​ 4 వరకు పాక్షిక లాక్​డౌన్ విధించారు అధికారులు. ఠాణెలోని 16 కరోనా హాట్​స్పాట్ ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Partial lockdown in Aurangabad from March 11 to April 4
కరోనా విలయం: ఔరంగబాద్​, ఠాణెలో మళ్లీ లాక్​డౌన్​

By

Published : Mar 9, 2021, 12:44 PM IST

మహారాష్ట్ర ఔరంగబాద్ జిల్లాలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మార్చి 11 నుంచి ఏప్రిల్​ 4 వరకు జిల్లాలో పాక్షిక లాక్​డౌన్ విధించారు అధికారులు. శని, ఆది వారాల్లో పూర్తి స్థాయిలో లాక్​డౌన్ అమల్లో ఉంటుందని.. ఆ సమయంలో షాపింగ్​ మాల్స్​, సినిమా హాళ్లను మూసివేయాలని ఆదేశించారు ఔరంగబాద్ కలెక్టర్​ సునీల్ చవాన్​. మతపరమైన, వివాహాది శుభకార్యాలు, రాజకీయ సమావేశాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

కర్ఫ్యూ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుందన్నారు. వారాంతపు రోజుల్లో కేవలం నిత్యావసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా దృష్ట్యా అత్యంత రద్దీ ప్రాంతమైన భాజీ మందాయ్​ను వారం(మార్చి 11 నుంచి 17)రోజుల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు.

ఠాణెలోనూ..

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ఠాణెలోని 16 కరోనా హాట్​స్పాట్ ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో 22,28,471 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 97,637 క్రియాశీల కేసులు ఉన్నాయి. వైరస్​ కారణంగా 52,500 మంది మరణించారు.

ఇదీ చదవండి :పాఠశాలలో 35 మంది విద్యార్థులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details