Parliament session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ చివరిసారిగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు సమావేశమైంది.
జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ప్రస్తుత భవనంలో చివరివి! - వర్షాకాల సమావేశాలు
Parliament monsoon session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి.
మొత్తం 18 సిట్టింగ్ల్లో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు భారత రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు. ఆగస్టు 6 ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ కుదిరితే వర్షాకాల సమావేశాల తర్వాత జరిగే సెషన్లు.. నూతన భవనంలోనే జరిగే అవకాశం ఉందని సమాచారం.