నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 25నే సమావేశాలను ముగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ రెండో విడత సమావేశాలు జరగాల్సి ఉంది.
పలువురు ఎంపీలు తమ పార్టీల తరఫున హాజరై.. సమావేశాలను వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సుదీప్ బందోపధ్యాయ్, డెరెక్ ఒబ్రియెన్... పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖలు రాశారు.
ఇదీ చదవండి:ఆన్లైన్లో కత్తుల కోసం ఆర్డర్లు- ఆందోళనలో పోలీసులు