కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖాతాలను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేసింది ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్. దీనిపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ. ఖాతాల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు.
"సమాచార సాంకేతిక విభాగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా.. రవిశంకర్ ప్రసాద్, నా ఖాతాల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఇండియాను కోరనున్నాం. భారత్‌లో సేవలకు ఎలాంటి నిబంధనలు, విధానాలు పాటిస్తున్నారో ట్విట్టర్ తెలపాల్సి ఉంటుంది. "
- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ.
అంతకు ముందు తన ఖాతా నిలిపివేతపై ట్వీట్ చేశారు శశిథరూర్. 'సమస్యను వివరించేందుకు నా ఖాతాను ట్విట్టర్ మరోమారు నిలిపివేసింది. ఈ విషయంలో తొలి ట్వీట్లో కాపీరైట్ వీడియో ఉన్నట్లు పేర్కొంది. డీసీఎంఏ నోటీసుకు స్పందనగా.. ఖాతాను లాక్ చేయటం ఒక పిచ్చి చర్య. వీడియోను తొలగించటం చేస్తే సరిపోతుంది. ట్విట్టర్ ఇంకా చాలా తెలుసుకోవాలి. 'అని రాసుకొచ్చారు.
ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతాను.. అమెరికా డిజిటల్ మిలేనియమ్ కాపీరైట్ యాక్ట్ ఉల్లంఘనల పేరుతో సుమారు గంటపాటు నిలిపివేసింది ట్విట్టర్. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి. ట్విట్టర్ చర్య.. భారత ఐటీ చట్టం 2021 రూల్స్‌ను ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా ఈ చర్యకు పూనుకోవటం సరికాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కేంద్ర ఐటీ మంత్రికే ట్విట్టర్ ఝలక్