తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును సందర్శించాలని రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ స్థాయీ సంఘం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జుయేల్ ఓరాం అధ్యక్షతన 30 మంది సభ్యులతో కూడిన కమిటీ.. ఈ ఏడాది మే నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో సందర్శించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ కమిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
లద్దాఖ్ సందర్శనకు పార్లమెంటరీ ప్యానెల్!
పార్లమెంటరీ ప్యానెల్.. భారత్-చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్యానెల్ అంతకముందు నిర్వంహించిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
లద్దాఖ్ సందర్శనకు పార్లమెంట్ రక్షణ స్థాయీ సంఘం!
అంతకుముందు ప్యానెల్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్యానెల్ ఎల్ఏసీని సందర్శించాలని భావిస్తున్నప్పటికీ.. ఇది ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్