తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈనెల 18న అఖిల పక్ష సమావేశం - పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

ఈనెల 18న అఖిల పక్ష సమావేశం నిర్వహించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి పిలుపునిచ్చారు. ఉదయం 11 నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది.

all party meeting, nda floor leaders meeting
ఈనెల 18న అఖిల పక్ష సమావేశం

By

Published : Jul 14, 2021, 10:52 AM IST

Updated : Jul 14, 2021, 12:01 PM IST

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేంద్రం అన్ని పార్టీలను అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించింది. సభను సజావుగా నడిపేందుకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను కోరేందుకు ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.

అటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం 18వ తేదీన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. రాజ్యసభ పక్ష నేతలతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు భేటీకానున్నారు. అఖిల పక్ష భేటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ నెల19న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13తో ముగుస్తాయి.

ఇదీ చదవండి :Corona cases: దేశంలో మరో 38,792 కరోనా కేసులు

Last Updated : Jul 14, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details