తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టువీడని విపక్షాలు- ఉభయసభలు రేపటికి వాయిదా - loksabha news

parliament winter session live, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
parliament winter session live

By

Published : Nov 30, 2021, 10:58 AM IST

Updated : Nov 30, 2021, 3:17 PM IST

15:09 November 30

వాయిదా అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు లోక్​సభ తిరిగి ప్రారంభమైంది. విపక్షాల సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. 'వీ వాంట్ జస్టిస్'​ నినాదాలతో సభను హోరెత్తించారు. స్పీకర్​ మాత్రం వివిధ అంశాలపై సంబంధిత సభ్యులు వివరణ ఇచ్చేందుకు అవకాశమిచ్చారు. విపక్ష సభ్యులు ఆందోళనలు విరమించి సభ జరిగేందుకు సహకరించాలని కోరారు. కానీ వారు నిరసనలు కొనసాగించడవం వల్ల సభను బుధవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

14:21 November 30

రాజ్యసభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. విపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత తరిగి ప్రారంభమైన సభలో కాసేపు చర్చ జరిగింది. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

14:14 November 30

విపక్షాలకు స్పీకర్ పిలుపు..

విపక్షాలు తరచూ ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించారు లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా. నిరసనలు ఆపి సభా కార్యకాలాపాలు సజావుగా సాగేందుకు సహకరించే విషయంపై వారితో చర్చించనున్నారు.

14:03 November 30

వాయిదాల పర్వం..

వాయిదా అనంతరం లోక్​సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేమైంది. అయినా విపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. రాజ్యసభలో సస్పెం డైన 12మంది సభ్యులకు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభ మరోమారు మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.

13:29 November 30

క్రిప్టో కరెన్సీపై..

క్రిప్టో కరెన్సీపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. త్వరలో కేంద్రం సంబంధిత బిల్లు తీసుకువస్తుందని ఆమె చెప్పారు. ఇంకా పూర్తిస్థాయి కార్యాచరణ కాలేదని నిర్మల స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీ ప్రకటనల నిషేధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఆర్​బీఐ, సెబీల ద్వారా.. క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం.. రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది.

12:24 November 30

ఒక్క ఒమిక్రాన్​ కేసు లేదు..

భారత్​తో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

12:23 November 30

విపక్షాల మరో భేటీ..

12 మంది ఎంపీల సస్సెన్షన్ అంశంపై చర్చించేందుకు విపక్షాలు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్​ ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరగుతోంది.

11:46 November 30

ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగాయి. 12మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి.

11:21 November 30

12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విషయంతో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభ్యులు గత సమావేశాల్లో సభలో విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. అలాంటి వారిని స్పస్పెండ్ చేయడం న్యాయమే అన్నారు.

సభ్యుల సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే వెంకయ్యను విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లామన్నారు. గత సెషన్​లో జరిగిన దానికి ఇప్పుడు వేటు వేయడం తగదన్నారు. వెంకయ్య నాయుడు మాత్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సభ ఛైర్మన్​గా సభ్యులను సస్పెండ్​ చేసే అధికారం తనకు ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

11:11 November 30

లోకసభలో విపక్షాలు వరుసగా రెండో రోజూ ఆందోళనలు కొనసాగించాయి. స్పీకర్​ ఓం బిర్లా పలుమార్లు చెప్పినా నిరసనలను విరమించలేదు. కాంగ్రెస్​, డీఎంకే, నేషనర్​ కాన్ఫరెన్స్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

11:05 November 30

లోక్​సభలో ప్రత్నోత్తరాల సమయం కొనసాగుతోంది. విపక్ష సభ్యులు మాత్రం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సభాకార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులను స్పీకర్ కోరారు.

10:23 November 30

parliament winter session live

శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు రెండో రోజు సమావేశమవుతోంది. ఇవాళ లోక్​సభ ముందుకు రీప్రొడక్టివ్​ టెక్నాలజీ(రెగ్యులేషన్​) బిల్లు, 2020ని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవీయ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు(శాలరీస్​ అండ్​ కండీషన్స్ ఆఫ్​ సర్వీస్) బిల్లు 2021ని సభ ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

తొలిరోజే రభస

పార్లమెంట్​ శీతకాల సమావేశాల తొలిరోజే సభలో గందరగోళ పరిస్థితులు కన్పించాయి. లోక్​సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనల మధ్యే సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు, 2021 ఆమోదం పొందింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టినా ప్రయోజనం లేకపోయింది. పులుమార్లు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

పార్లమెంట్​ వేసవికాల సమావేశాల్లో సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు 12మంది రాజ్యసభ సభ్యులపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. వీరిని మొత్తం శీతాకాల సమావేశాలకు హాజరుకాకుండా ఛైర్మన్ నిషేధం విధించారు. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము ఏ తప్పూ చేయలేదని, సభా నియమాలకు విరద్దంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని ఆరోపించాయి.

అయితే సస్పెన్షన్​కు గురైన 12మంది ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడును కలిసి క్షమాపణలు చెబుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సస్పెండ్​కు గురైన ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్​ సభ్యులు, టీఎంసీ, శివసేన నుంచి ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కరు ఉన్నారు.

విపక్షాల భేటీ..

12 మంది సభ్యుల సస్పెన్షన్​ను వ్యతిరేకిస్తూ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో సమావేశమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీకి టీఎంసీ దూరంగా ఉంది.

మోదీ భేటీ..

శీతకాల సమావేశాల్లో విపక్షాల ఆరోపణలు తిప్పికొడుతూ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలనే విషయంపై హొంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ సహా కేబినెట్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు.

Last Updated : Nov 30, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details