తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిపిన్​ రావత్​ మరణం.. పార్లమెంట్​లో రాజ్​నాథ్​ ప్రకటన - పార్లమెంట్​ సమావేశాలు

parliament winter session live updates
బిపిన్​ రావత్​ మరణం.. పార్లమెంట్​లో రాజ్​నాథ్​ ప్రకటన

By

Published : Dec 9, 2021, 10:44 AM IST

Updated : Dec 9, 2021, 11:49 AM IST

11:16 December 09

రాజ్యసభలో రాజ్​నాథ్​ ప్రకటన

లోక్​సభ అనంతరం.. రాజ్యసభలోనూ ప్రకటన చేశారు రాజ్​నాథ్​ సింగ్​. ఘటనతో దిగ్భ్రాంతి చెందినట్టు.. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

అంతకుముందు.. ప్రమాదంలో మృతి చెందిన వారికి రాజ్యసభ సభ్యులు సంతాపం తెలిపారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

11:03 December 09

రాజ్​నాథ్​ ప్రకటన

లోక్​సభ వేదికగా.. కూనూర్​ ప్రమాదంపై రాజ్​నాథ్​ సింగ్​ ప్రకటన చేశారు.

"మ. 12.08 గం.కు రాడార్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు అక్కడికి వెళ్లారు. స్థానికులు వెళ్లేసరికి హెలికాప్టర్ మంటల్లో ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. సీడీఎస్​ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య మృతిచెందడం బాధాకరం. ప్రమాదంపై వాయుసేన దర్యాప్తు చేపట్టింది. దీనికి ఎయిర్​ మార్షల్​ మనవేంద్ర సింగ్​ నేతృత్వం వహిస్తున్నారు. దర్యాప్తు బృందం బుధవారమే వెల్లింగ్​టన్​కు వెళ్లింది. దర్యాప్తు ప్రారంభించింది."

--- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్​ ఘటనలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు.

10:52 December 09

బిపిన్​ రావత్​ కోసం..

సీడీఎస్​ బిపిన్​ రావత్​కు నివాళిగా.. విపక్షాలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. 12మంది ఎంపీల సస్పెన్షన్​పై ఆందోళనలు చేస్తున్న విపక్షాలు.. గురువారం నిరసనలను నిలిపివేశాయి.

10:28 December 09

పార్లమెంటు లైవ్ అప్డేట్స్

తమిళనాడు కూనూర్​లో సైనిక హెలికాప్టర్​ కూలి సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది మరణించిన ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. కాసేపట్లో పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.

మరోవైపు పార్లమెంట్​లో కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజ్​నాథ్​ సింగ్​, నిర్మలా సీతారామన్​ తదితరులు హాజరయ్యారు.

Last Updated : Dec 9, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details