లోక్‌సభ రేపటికి వాయిదా..
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగాయి.
20:27 December 07
లోక్‌సభ రేపటికి వాయిదా..
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగాయి.
15:27 December 07
రాజ్యసభ రేపటికి వాయిదా..
విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం అసలు సభ కార్యకలాపాలు జరగలేదు.
14:26 December 07
రాజ్యసభ మళ్లీ వాయిదా..
రాజ్యసభలో 7వ రోజూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. 12మంది ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఉదయం 11:10కి సభ వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు మొదలైంది. విపక్షాల మళ్లీ నిరసన చెపట్టాయి. ఈసారి పెద్దల సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది.
12:14 December 07
రైతు మరణాలపై
లోక్‌సభ వేదికగా.. ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
"నిరసనల్లో 700మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. దేశానికి, దేశంలోని రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. తప్పుచేశానని ఆయనే అంగీకరించారు. ఇప్పుడేమో.. రైతుల మరణంపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం చెబుతోంది. ఏంటిది? 400మంది రైతులకు పంజాబ్ ప్రభుత్వం రూ. 5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. 152మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నా దగ్గర లిస్టు ఉంది. ప్రభుత్వం మాత్రం డేటా లేదు అంటోంది. రైతుల హక్కులు.. రైతులకు ఇవ్వాలి. వారికి ఉద్యోగాలివ్వాలి. ఇదే మా డిమాండ్"
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
11:06 December 07
రాజ్యసభ వాయిదా
ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. 12మంది ఎంపీల సస్పెన్ష్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారీ ఎత్తున నినాదాలు చేశాయి. కార్యకలాపాలు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్నాయి.
మరోవైపు విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభలో జరుగుతోంది.
10:45 December 07
7వ రోజుకు చేరిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 7వ రోజుకు చేరాయి. ఉభయ సభల ముందు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి.
సోమవారం నాడు.. నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సిట్‌తో దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
అమిత్ షా ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. మరోవైపు షా ప్రకటన అనంతరం రాజ్యసభ నేటికి వాయిదా పడింది.