విపక్ష నేతల వాకౌట్..
రాజ్యసభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్ష నేతల నిరసనలు కొనసాగాయి. ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ పరిస్థితి మారకపోవడం వల్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
14:27 December 14
విపక్ష నేతల వాకౌట్..
రాజ్యసభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్ష నేతల నిరసనలు కొనసాగాయి. ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ పరిస్థితి మారకపోవడం వల్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
13:11 December 14
రాహుల్ ఫైర్...
పార్లమెంట్ ఆవరణంలో విపక్షాలు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
"దేశంలో ప్రజా గొంతుకను నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఎంపీల సస్పెన్షన్ నిదర్శనం. ఎంపీల గొంతును నొక్కేస్తున్నారు. వారు ఎలాంటి తప్పు చేయలేదు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్లో చర్చించేందుకు మాకు అనుమతినివ్వడం లేదు. పార్లమెంట్లో చర్చలు లేకుండానే బిల్లుల మీద బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. పార్లమెంట్‌ను నడిపే విధానం ఇది కాదు. ప్రధాని సభకు రావడం లేదు. జాతీయస్థాయిలో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించేందుకు మాకు అవకాశం లభించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారు." -- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
13:08 December 14
ఎంపీల ఆందోళన..
12మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన పార్లమెంట్ దాటింది. ఆందోళనలో భాగంగా.. విపక్ష ఎంపీలు.. దిల్లీలోని పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. ఎంపీల సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
12:46 December 14
రాజ్యసభలో 12మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
11:57 December 14
రాజ్యసభలో నిరసనలు..
12మంది ఎంపీల సస్పెన్షన్‌పై రాజ్యసభలో విపక్షాలు నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఉపరాష్ట్రపతి, సభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వెల్ ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్న విపక్షాల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అయినప్పటికీ ఎంపీలు మాట వినకపోవడం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
10:48 December 14
పార్లమెంట్ లైవ్
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్లో విపక్షాలు భేటీ అయ్యాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వ్యవహారం సహా తదుపరి కార్యాచరణపై సభ్యులు చర్చ జరిపినట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్‌పై నిరసనగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు విపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.