తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంటు క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత - parliament budget session 2021

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. సభ్యులంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

parliament-session-beginning-jan-29-ls-speaker-om-birla
జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు

By

Published : Jan 19, 2021, 4:48 PM IST

Updated : Jan 19, 2021, 5:09 PM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి 29 నుంచి సభలు ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అవుతుందని, లోక్​సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని వెల్లడించారు. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పష్టం చేశారు.

పార్లమెంట్​కు వచ్చే ఎంపీలందరూ తప్పక కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. ఆర్​టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ్యుల ఇంటి వద్ద సైతం కొవిడ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన టీకా పంపిణీ విధానాలే పార్లమెంట్ సభ్యులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు బిర్లా.

మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్​లో సభ్యులకు అందించే సబ్సిడీ నిలిపివేసినట్లు తెలిపారు. దీంతో క్యాంటీన్​లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. సబ్సిడీ తొలగించడం వల్ల సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్​ను ఇక నుంచి 'నార్తన్ రైల్వే'కు బదులు 'ఇండియన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్' నిర్వహించనుందని బిర్లా స్పష్టం చేశారు.

Last Updated : Jan 19, 2021, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details