Parliament panel news: సమస్యల మీద పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వెలువడే కథనాలపై, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఆయా మంత్రిత్వ శాఖలు ఎప్పటికప్పుడు సమీక్ష జరిపేలా 'పరిపాలన సంస్కరణలు- ప్రజా ఫిర్యాదుల విభాగం' (డీఏఆర్‌పీజీ) చూడాలని 'సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం-న్యాయం' పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.
Review of grievances
కేంద్ర ప్రభుత్వంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపై ఈ మేరకు ఒక నివేదికను కమిటీ వెలువరించింది. వేరే విభాగాన్నో తమ కంటే కింది స్థాయి కార్యాలయాన్నో సంప్రదించాలని సూచించి ఫిర్యాదును పరిష్కరించినట్లు చూపిస్తున్నారని ఈ నివేదిక ప్రస్తావించింది.
ప్రజా ఫిర్యాదుల స్వీకారం, పరిష్కారానికి కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ఒక సదుపాయకారిగా ఉండాలని అభిప్రాయపడింది. ప్రజా ఫిర్యాదులపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లను క్రోడీకరించి, అవి సరైన విభాగానికే వెళ్లేలా చూడాలంది. ఇలాంటి మరికొన్ని సూచనలు చేసింది.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాద బాధితులకు తొలి 48 గంటలు వైద్యం ఫ్రీ!