Parliament New Building Flag Hoisting :ఉపరాష్ట్ర జగదీప్ ధన్‌ఖడ్.. కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ కార్యక్రమం జరిగింది. కొత్త పార్లమెంట్ గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజర్ చౌదరి, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంట్లో విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గౌరవ వందనం స్వీకరించారు.
'ఇదొక చరిత్రాత్మక ఘట్టం'
Flag Hoisting At New Parliament Building :కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడాన్ని ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్. ' భారత్ శక్తి, సామర్థ్యాలను ప్రపంచం మొత్తం గుర్తించింది. దేశం అభివృద్ధి, విజయాలను సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం.' అని అన్నారు.
'నేను పనికిరానా'
Congress New Party Name Building :కొత్త పార్లమెంట్ భవనం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. 'నేను జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి పనికిరాకపోతే చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. ఈ కార్యక్రమానికి హాజరైనవారిపై దృష్టి పెట్టండి.' అని బదులిచ్చారు.