తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అఖిలపక్ష నేతలతో ఓంబిర్లా భేటీ.. వాటిపై చర్చించాలని కాంగ్రెస్​ డిమాండ్​

Parliament Monsoon Session: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో సభా మర్యాదలు కాపాడాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కోరారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మరోవైపు, అగ్నిపథ్ పథకంపై సభలో చర్చ జరపాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది.

Parliament Monsoon Session
Parliament Monsoon Session

By

Published : Jul 16, 2022, 5:46 PM IST

Om Birla Meeting All Party Leaders: జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలను లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కోరారు. ప్రతి ఒక్క సభ్యుడు.. సభా మర్యాదలను కచ్చితంగా కాపాడాలని తెలిపారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన.. అన్ని పార్టీల నేతలకు వివరించారు.

అన్ని రాజకీయ పార్టీల నేతలతో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ
వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయని ఓం బిర్లా తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలు జరపాలని అన్ని పార్టీల నేతలందరికీ విజ్ఞప్తి చేశానని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి భాజపా నుంచి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్‌మేఘవాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే, వైకాపా, ఆర్​ఎల్​జేపీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే తెరాస మాత్రం అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంది.
అన్ని పార్టీల నేతలతో ఓం బిర్లా సమావేశం

'అగ్నిపథ్​పై చర్చకు డిమాండ్​'
త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని డిమాండ్​ చేశామని కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్​ చేసినట్లు ఆయన చెప్పారు. సభలో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షానికి తగినంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:'ఓట్ల కోసం ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం'

ABOUT THE AUTHOR

...view details