రేపటికి వాయిదా
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం కానున్నారు. వాయిదాకు ముందు కోకోనట్ బోర్డు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
15:38 August 04
రేపటికి వాయిదా
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం కానున్నారు. వాయిదాకు ముందు కోకోనట్ బోర్డు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
15:14 August 04
మరో బిల్లు పాస్
ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. దీనిపై మూజువాణి ఓటింగ్ జరగ్గా... విపక్షాల ఆందోళనల మధ్య బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ సర్కారు రెట్టింపు ఎయిర్‌పోర్టులను నిర్మించిందని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో చిన్న నగరాలకు సైతం విమాన సౌకర్యం అందిందని చెప్పారు.
బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
14:43 August 04
వాయిదా
డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్ట సవరణ బిల్లుకు సైతం రాజ్యసభ పచ్చజెండా ఊపింది. అనంతరం సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది.
14:36 August 04
టీఎంసీ ఎంపీల నిరసన
రాజ్యసభలో ఒకరోజు సస్పెన్షన్‌కు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసనకు దిగారు. రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. వీరిని నిలువరించేందుకు మార్షల్స్‌ను మోహరించారు.
14:33 August 04
బిల్లు ఆమోదం
లిమిటెడ్ లయబిలిటీ భాగస్వామ్య సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగానే బిల్లుకు.. మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదం తెలిపింది.
14:11 August 04
లోక్‌సభ వాయిదా
దిల్లీలో వాయు కాలుష్యం నియంత్రించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో దీనికి పచ్చజెండా ఊపింది. సభ్యుల ఆందోళనల మధ్యే దీనికి ఆమోదం లభించింది. అనంతరం సభ 3.30 గంటలకు వాయిదా పడింది.
12:20 August 04
ఫోన్ల హ్యాకింగ్, రైతు సంబంధిత అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
12:11 August 04
సభా వ్యవహారాలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. ఈ రోజు జరిగే కార్యకలాపాలకు హాజరు కాకూడదని ఆదేశించారు.
విపక్ష ఎంపీల ఆందోళనలతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే.. టీఎంసీ సహా ఇతర విపక్ష ఎంపీలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
సభ్యులు వెళ్లి తమ సీట్లలో కూర్చోవాలని ఛైర్మన్ వెంకయ్య తొలుత అభ్యర్థించారు. అయినా వినకపోవడం వల్ల రూల్ 255 ప్రకారం... నిరసన చేస్తున్న ఎంపీలను సస్పెండ్ చేశారు.
11:58 August 04
పెగసస్ వ్యవహారంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్.
11:20 August 04
పెగసస్ వ్యవహారంపై ఆందోళన- ఉభయ సభలు వాయిదా
పెగసస్, వ్యవసాయ చట్టాలపై విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ, లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం 11.30 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడ్డాయి.
పెగసస్, వ్యవసాయ చట్టాలతో పాటు ఇతర సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని రెండు సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. బిగ్గరగా నినాదాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు సభలు వాయిదా పడ్డాయి.
అంతకు ముందు కాంగ్రెస్ నేత మల్లిఖార్జు ఖర్గే కార్యాలయంలో విపక్ష నాయకులు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.