తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్ ఎంపీ సస్పెన్షన్​​పై గందరగోళం.. ఉభయ సభలు రేపటికి వాయిదా

parliament monsoon session 2023
parliament monsoon session 2023

By

Published : Jul 24, 2023, 10:43 AM IST

Updated : Jul 24, 2023, 3:18 PM IST

15:15 July 24

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్‌పై గందరగోళం నెలకొనడం వల్ల రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సస్పెన్షన్​ను ఎత్తివేయాలంటూ విపక్షాల నిరసనల నేపథ్యంలో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

14:32 July 24

విపక్షాల నిరసనల మధ్య లోక్​సభ రేపటికి వాయిదా పడింది. సభ సజావుగా సహకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరినప్పటికీ విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో రేపటికి సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.

14:15 July 24

మణిపుర్‌ అంశంపై విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ.. మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది.

14:10 July 24

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్‌పై గందరగోళం నెలకొనడం వల్ల రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ ప్రకటించారు.

13:30 July 24

వర్షాకాల సమావేశాల్లో సభ పనితీరుపై రాజ్యసభ ఛైర్మన్​ జగ్​దీప్​ ధనఖడ్​.. అన్ని పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు, ప్రతిపక్ష నేతలతో కేంద్రమంత్రులు ప్రహ్లాద్​ జోషి, అర్జున్​ రామ్ మేఘ్వాల్​ కూడా సమావేశమయ్యారు.

12:15 July 24

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్​పై సస్పెన్షన్ వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేవరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్​కఢ్ వెల్లడించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మణిపుర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన నేపథ్యంలో సంజయ్​పై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

12:13 July 24

మణిపుర్ అంశంపై చర్చించాలని పట్టుబడుతూ విపక్షాలు చేపట్టిన ఆందోళనల మధ్య లోక్​సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

11:39 July 24

శాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండటం వల్ల ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. 'ఇండియా ఫర్ మణిపుర్‌', 'మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి' అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల మధ్యే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

11:30 July 24

మణిపుర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.

11:21 July 24

సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఛైర్మన్ జగ్​దీప్ ధన్​ఖడ్​.. రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు.. లోక్‌సభలో సెషన్‌ ప్రారంభం కాగానే మణిపుర్​పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్ష కూటమి(ఇండియా) సభ్యులు పట్టుబట్టారు. 'ఇండియా ఫర్‌ మణిపుర్‌', 'ప్రధాని మోదీ మణిపుర్​ ఘటనలపై ప్రకటన చేయాలి' అని ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళన చేపట్టాయి.

11:03 July 24

వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.

10:53 July 24

మణిపుర్​ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగే నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలను అభ్యర్థిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. చర్చల నుంచి ప్రతిపక్షాలు ఎందుకు తప్పించుకుంటున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. అంతకుముందు.. మణిపుర్‌ అల్లర్లపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా కోరుతుందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

10:30 July 24

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ ఎదుట విపక్షాల ఆందోళన

Parliament Monsoon Session 2023 : పార్లమెంట్ ఉభయసభల్లో మణిపుర్​ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు (ఇండియా కూటమి) డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంట్​ ముందు ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళన చేపట్టాయి.

Last Updated : Jul 24, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details