తెలంగాణ

telangana

మణిపుర్ అంశంపై రచ్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా

By

Published : Jul 20, 2023, 10:35 AM IST

Updated : Jul 20, 2023, 2:37 PM IST

Monsoon Session of Lok Sabha and Rajya Sabha will begin today amid Opposition gearing up to corner the government on various issues including a debate on violence-torn Manipur. Follow this page for updates related to the session.

parliament monsoon session 2023 live updates
parliament monsoon session 2023 live updates

14:37 July 20

'చర్చిద్దాం'
మణిపుర్ అంశంపై ఉభయసభల్లో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయాన్ని ఇదివరకే స్పష్టంగా చెప్పామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు. మణిపుర్ అంశం సున్నితమైనదని, కేంద్ర హోంమంత్రి దీనిపై సభలో వివరంగా మాట్లాడతారని చెప్పారు. ఈ అంశంపై చర్చకు తేదీ నిర్ణయించేందుకు స్పీకర్​కు సహకరించాలని మంత్రి కోరారు.

14:14 July 20

ఖర్గే ఆవేదన..
అంతకుముందు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభలో మాట్లాడుతూ మణిపుర్ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణిపుర్​లో మహిళలను అత్యాచారం చేస్తున్నారని, నగ్నంగా వారిని ఊరేగిస్తున్నారని అన్నారు. ఈ ఘటనలపై ప్రధాని మోదీ మౌనం వల్ల తప్పుడు సందేశం వెళ్తోందని వ్యాఖ్యానించారు.

14:08 July 20

మణిపుర్ అంశంపై పార్లమెంట్​లో విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో సభాకార్యకలాపాలు సజావుగా జరగకుండానే సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్​సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశం కానుందని స్పీకర్ ప్రకటించారు. అటు, రాజ్యసభను సైతం రేపటికి వాయిదా వేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు.

14:04 July 20

మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.

12:19 July 20

రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత సభలో మణిపుర్ అంశంపై చర్చ మొదలైంది. అయితే, మణిపుర్ అంశంపై స్వల్పకాల చర్చ జరపాలని కొందరు ఎంపీలు పేర్కొనగా.. మరికొందరు మాత్రం సాధారణ చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీలు తిరిగి సమావేశం కానున్నారు.

12:07 July 20

వాయిదా అనంతరం రాజ్యసభ మళ్లీ భేటీ అయింది.

11:13 July 20

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. రాజ్యసభలో ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ ప్రకటించారు. ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో కొనసాగే సమావేశాల్లో 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

11:03 July 20

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే మరణించిన సభ్యుల మృతి పట్ల లోక్​సభలో ఎంపీలు సంతాపం తెలిపారు.

10:53 July 20

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. "మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసింది. 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది. మహిళల భద్రత విషయంలో రాజీ పడం. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నా" అని మోదీ స్పష్టం చేశారు.

10:49 July 20

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. ఈ సమావేశంలో అనేక బిల్లులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని ఈ మేరకు మాట్లాడారు.

10:38 July 20

  • పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి: ప్రధాని మోదీ
  • అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చలు జరగాలని కోరుకుంటున్నాం: ప్రధాని
  • ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలి: ప్రధాని
  • ప్రజా సమస్యలు సభలో ప్రస్తావించేందుకు మంచి సమయం దొరుకుతుంది: ప్రధాని
  • ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ప్రధాని మోదీ
  • ఈ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లులు తెస్తున్నాం: ప్రధాని
  • ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు ఈ సమయం వినియోగించుకోవాలి: ప్రధాని

10:06 July 20

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు 2023

Parliament Monsoon Session 2023 : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల తొలిరోజు.. మణిపుర్​లో తలెత్తిన పరిస్థితులపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఉభయసభల్లో నోటీసులు ఇచ్చారు. మణిపుర్​లో ఇద్దరు మహిళలు ఊరేగించిన వీడియో వైరల్​ అవ్వడం వల్ల ఈ వివాదంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్.. రాజ్యసభలో రూల్ 267 ప్రకారం మణిపర్​ అంశంపై చర్చించాలని బిజినెస్​ నోటీస్​ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న హింసపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాకూర్‌ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. మణిపుర్​ అంశంపై చర్చ జరగనుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు సమాధానం ఇస్తారని చెప్పారు.

"పార్లమెంట్​లో మణిపుర్​ అంశాన్ని లేవనెత్తుతాం. నేను కూాడా నోటీస్​ ఇచ్చాను. అయితే రాజ్యసభలో మణిపుర్​ అంశాన్ని మా ఛైర్మన్ అనుమతిస్తారో లేదో చూద్దాం. దీనిపై ప్రధాని మౌనంగా ఉన్నారు. మీకు 38 పార్టీలను (ఎన్‌డీఏ సమావేశానికి) పిలవడానికి సమయం ఉంది. కానీ మీకు (పీఎం) మణిపుర్​ వెళ్లడానికి సమయం లేదు" అని కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. బీజేపీపై మండిపడ్డారు.

Last Updated : Jul 20, 2023, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details