తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మణిపుర్​ అంశంపై రగడ.. పార్లమెంట్ మంగళవారానికి వాయిదా - పార్లమెంట్​ మణిపుర్​ అల్లర్లు

parliament monsoon session 2023 live updates debate on manipur issue
parliament monsoon session 2023 live updates debate on manipur issue

By

Published : Jul 31, 2023, 2:21 PM IST

Updated : Jul 31, 2023, 4:24 PM IST

15:55 July 31

Manipur issue in parliament : వరసగా 8వ రోజూ మణిపుర్‌ అంశం పార్లమెంటులో వాయిదాలకు దారితీసింది. మణిపుర్ ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల సభా కార్యకలాపాలకు విఘాతం కలిగింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం వల్ల సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్య పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విపక్షాల నినాదాల మధ్యే సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. తర్వాత మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది.

Parliament Monsoon session 2023 : మణిపుర్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా.. మధ్యాహ్నం 2 గంటలకు చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నిబంధన 267 కింద వెంటనే మణిపుర్ అంశంపై చర్చ జరగాలని.. విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధనఖడ్ ఎంత సర్దిచెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తర్వాత మూడు సార్లు వాయిదా పడిన రాజ్యసభ చివరకు మంగళవారానికి వాయిదా పడింది.

'చర్చ నుంచి పారిపోయారు'
మణిపుర్ అంశంపై చర్చకు విపక్షం సిద్ధంగా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వెలుపల అన్నారు. ఈ విషయం పార్లమెంట్​లో ప్రస్తావనకు రాగానే.. చర్చల నుంచి విపక్షాలు పారిపోయాయని ఆరోపించారు. మణిపుర్ అంశమనేది విపక్షాలకు కేవలం రాజకీయమేనని అన్నారు. ఈ విషయం పార్లమెంట్​లో నిరూపితమైందని చెప్పారు. సమస్యపై నిజంగా ఆందోళన ఉంటే చర్చలో పాల్గొనేవారని విపక్ష ఎంపీలకు నిర్మలా సీతారామన్ చురకలు అంటించారు.

15:20 July 31

విపక్షాల ఆందోళనల మధ్య లోక్​సభ రేపటికి వాయిదా పడింది.

14:36 July 31

రాజ్యసభ మరోసారి వాయిదాపడింది. చర్చ మొదలు కాగానే విపక్ష ఆందోళనలు మిన్నంటే సరికి 3.30కి సభను వాయిదా వేశారు.

14:11 July 31

రాజ్యసభలో మణిపుర్​ అంశంపై చర్చ

మణిపుర్​ అంశంపై స్వల్పకాలిక చర్చకు రాజ్యసభ ఛైర్మన్​ జగ్​దీప్​ ధన్​ఖడ్​ అవకాశమిచ్చారు. ఆ తర్వాత ఎంపీలు చర్చను ప్రారంభించారు. విపక్ష ఎంపీల నినాదాలతో సభను వెంటనే మధ్యాహ్నం 2.30కు వాయిదా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ధన్​ఖడ్​ ప్రకటించారు.

Last Updated : Jul 31, 2023, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details