parliament monsoon session 2022: పార్లమెంటులో వాయిదాలు, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 24 మంది సస్స్పెన్షన్ వేటుకు గురవగా తాజాగా ఆ జాబితాలోకి మరో ఎంపీ చేరారు. అనుచిత ప్రవర్తన కారణంగా ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ను ఈ వారం పూర్తయ్యేవరకు పాటు సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివన్ష్ పేర్కొన్నారు. మంగళవారం ఒక్కరోజే 19 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. అంతకుముందు లోక్సభలో నలుగురు సభ్యులు సస్పెండ్ అయ్యారు.
మరో ఎంపీ సస్పెన్షన్.. పార్లమెంటులో ఆగని వాయిదాల పర్వం - రాజ్యసభ వాయిదా
Sanjay singh suspended: పార్లమెంటులో సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. మంగళవారం 19 మందిపై వేటు పడగా తాజాగా బుధవారం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. మరోవైపు ఉభయసభల్లో వాయిదాలు కొనసాగుతున్నాయి.
పార్లమెంటు
మరోవైపు బుధవారం ఉదయం నుంచి లోక్సభ రెండు సార్లు వాయిదా పడింది. తొలుత 12 గంటల వరకు ఉన్న వాయిదాను.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించారు. రాజ్యసభ కూడా మూడు సార్లు వాయిదా పడింది. తొలుత గంట సేపు, తర్వాత 15 నిముషాలు, ఆ తర్వాత.. మధ్యాహ్నం 2గం.ల వరకు వాయిదా పడింది. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ అంశాలు, సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి :యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోలీసుల దౌర్జన్యం.. జుట్టు పట్టుకొని లాగి...