దేశంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవకముందే విదేశాలకు టీకాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ శక్తి సిన్హ్ రాజ్యసభకు జీరో అవర్ నోటీసు ఇచ్చారు. అయితే, ఈ అంశంపై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్.. టీకా విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని అన్నారు. ఉన్నతస్థాయి నిపుణులు, ఓ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 3 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
'టీకా పంపిణీ విషయంలో నిబద్ధతతో ప్రభుత్వం'
13:48 March 16
10:28 March 16
పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
పార్లమెంట్ ఉభయ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. షెడ్యూల్డ్ కులాల సవరణ బిల్లు-2021పై ఈరోజు చర్చ జరగనుంది.
రాజ్యసభలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లు-2020పై, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లు-2020పై చర్చించి వాటికి ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణపై ఉద్యోగులు నిరసన తెలపడంపై రాజ్యసభలో జీరో అవర్ నోటీసులిచ్చారు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.