విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్ సభ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది. అయితే వాయిదాకు మందు పన్ను చట్టాల సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.
పెగసస్‌పై విపక్షాల నిరసన- ఉభయ సభలు 9వ తేదీకి వాయిదా - పార్లమెంట్ లైవ్
12:26 August 06
12:12 August 06
పెగసస్ నిఘా వ్యవహారంపై విపక్షాల ఆందోళన రాజ్యసభలో కొనసాగింది. దీంతో సభ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది.
11:22 August 06
పార్లమెంటు సమావేశాలు లైవ్ అప్డేట్స్
పెగసస్ నిఘా వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.
ఈ గందరగోళం మధ్య లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
అంతకుముందు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహలపై విపక్ష నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చించారు.
అలాగే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు మద్దతు తెలపడం కోసం విపక్షాల నేతలు జంతర్ మంతర్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.