తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ ఖాతా హ్యాక్​పై పార్లమెంట్ స్థాయీసంఘం ప్రశ్నలు - పెగసస్ మోదీ న్యూస్

Parliament IT panel Pegasus: ప్రధాని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ సహా పెగసస్ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంట్ స్థాయీసంఘం ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ ముందు అధికారులు హాజరైనప్పటికీ.. హ్యాకింగ్, పెగసస్ గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

PM Modi Twitter hack
PM Modi Twitter hack

By

Published : Dec 14, 2021, 12:39 PM IST

PM Modi Twitter hack: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్​కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని స్థాయీసంఘం.. పెగసస్ అంశంపైనా అధికారులకు ప్రశ్నలు సంధించింది.

Pegasus hacking India

Tharoor IT panel on pegasus

పెగసస్ స్పైవేర్​ను ఉపయోగించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనే అంశంపై థరూర్ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని అధికారులు బదులిచ్చినట్లు వెల్లడించాయి. తమకు సహకరించాలని థరూర్ కోరినప్పటికీ.. అధికారులు వివరాలేవీ వెల్లడించలేదని పేర్కొన్నాయి. పెగసస్​పై చెప్పాల్సింది ఏమీ లేదంటూ తప్పించుకున్నారని వివరించాయి.

మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురించీ అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీని వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్​లో అందుబాటులో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.

ట్విట్టర్ ఖాతా హ్యాక్

ఆదివారం కొద్దిసేపు మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్​కు గురైంది. బిట్​కాయిన్​లు చట్టబద్ధం చేసినట్లు మోదీ హ్యాండిల్ నుంచి ట్వీట్లు వెలువడ్డాయి. అయితే, దీని గురించి ట్విట్టర్​ను సంప్రదించి సమస్యను పరిష్కరించామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఇటీవల ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు వరుసగా హ్యాక్​కు గురవుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ ట్విట్టర్ అకౌంట్లను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్​లో నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్​సైట్ ట్విట్టర్ ఖాతా (@narendramodi_in) కూడా హ్యాకింగ్ బారిన పడింది.

ఇదీ చదవండి:'పక్కా ప్రణాళికతోనే లఖింపుర్ ఖేరి ఘటన'

ABOUT THE AUTHOR

...view details