పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారంతో ముగియనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో షెడ్యూల్ తేదీ అయిన ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం లేదని వెల్లడించాయి. దాదాపు అన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓబీసీ బిల్లు సైతం ఆమోదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.
పార్లమెంట్ సమావేశాలకు నేడే ముగింపు! - పార్లమెంట్ సమావేశాలు న్యూస్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులు ఇప్పటికే ఆమోదం పొందిన నేపథ్యంలో సమావేశాలు ముగియనున్నట్లు సమాచారం.
పార్లమెంట్
ఓబీసీ బిల్లుపై సభలో సమగ్రంగా చర్చించేందుకు అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని బిల్లులపై గురువారం కూడా రాజ్యసభలో చర్చ జరగనుందని వెల్లడించాయి. ప్రతిపక్షాలు మొండివైఖరి కొనసాగిస్తే.. సభను వాయిదా వేయడం లేదా ముగించడం జరగొచ్చని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇదీ చదవండి:ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం