తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో కరోనా కలకలం- 850కిపైగా కేసులు - Parliament Covid Outbreak

Parliament Covid Outbreak: పార్లమెంట్​లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. మొత్తం కేసుల సంఖ్య 850 దాటింది. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరు కావాలని ఇప్పటికే సిబ్బందికి చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

parliament covid cases
పార్లమెంట్​లో కరోనా

By

Published : Jan 15, 2022, 7:51 PM IST

Parliament Covid Outbreak: మహమ్మారి వ్యాప్తికి ఎన్ని చర్యలు చేపడుతున్నా పార్లమెంటులో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 850 పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిలో 250 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు పార్లమెంటు సిబ్బందికి టెస్టులు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత నిలిపివేశారు.

ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరు కావాలని ఇప్పటికే సిబ్బందికి చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నా విధులకు రావద్దని, అవసరం అయితే.. ఇంటి నుంచే విధులు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రెండు విభాగాలుగా ఉద్యోగులను విధులకు హాజరు కావాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details