తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సభను సజావుగా సాగనివ్వాలి.. ఆందోళనలు వద్దు' - లోక్​సభ లైవ్​

parliament budget session live updates
పార్లమెంటు బడ్జెట్ సెషన్ లైవ్ అప్డేట్స్​

By

Published : Feb 2, 2022, 10:03 AM IST

Updated : Feb 2, 2022, 2:39 PM IST

12:23 February 02

బడ్జెట్​ సమావేశాలను సజావుగా సాగనివ్వాలని రాజ్యసభ సభ్యులను కోరారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. సభలో అంతరాయాలు కలవారపాటుకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆందోళనల కారణంగా శీతకాల సమావేశాల్లో 52శాతం సభాకాలం వృథా అయిందని గుర్తు చేశారు.

10:55 February 02

కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్ మాండవీయ పార్లమెంటు సమావేశాలకు సైకిల్​పై వచ్చారు.

10:21 February 02

మలేషియాలో భారీ వరదల కారణంగా మరణించిన వారికి, టోంగా అగ్నిపర్వతం పేలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాజ్యసభ సభ్యులు సంతాపం తెలిపారు.

09:51 February 02

parliament budget session live updates

Parliament budget session live: పార్లమెంటులో బడ్జెట్​ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు ఉభయ సభలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు లోక్​సభ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్​పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రవాణా, పర్యటకం, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన 6 నివేదికలను పార్లమెంటరీ ​ కమిటీ ఇవాళ సభ ముందుకు తీసుకురానుంది.

అయితే పెగసస్​పై చర్చ జరపాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం, సీపీఎం ఎంపీ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.

Last Updated : Feb 2, 2022, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details