సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగిన క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈనెల 15వ తేదీకి వాయిదా పడ్డాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమవగా.. సాగు చట్టాలు, చమురు ధరలపై ఆందోళనకు దిగాయి విపక్షాలు. దీంతో సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా.. వాయిదాల పర్వం కొనసాగింది.
బిల్లుకు ఆమోదం.
మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు-2021కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.