తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడి ఫొటోతో సినిమా చూసిన తల్లిదండ్రులు

అతను ఓ ప్రముఖ నటుడికి వీరాభిమాని. అభిమాన హీరో సినిమాను చూసేలోపే కన్నుమూశాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కుమారుడికి తీరని కోరికగా మిగిలిపోయిన ఆ సినిమాకు అతనికి కూడా టికెట్​ బుక్​ చేశారు. కుమారుడి చిత్రపటంతో కలిసి భావోద్వేగానికి గురవుతూ సినిమా చూశారు.

By

Published : Apr 6, 2021, 11:59 AM IST

చనిపోయిన కొడుకు ఫొటోతో సినిమా, parents bought tickets for dead son
కుమారుడి ఫొటోతో సినిమా చూస్తున్న తల్లిదండ్రులు

మృతిచెందిన తమ కుమారుడి చివరి కోరిక తీర్చేందుకు అతని అభిమాన హీరో చిత్రానికి కుమారుడి చిత్రపటంతో వెళ్లారు ఆ తల్లిదండ్రులు. సినిమా చూస్తున్నంత సేపు తమ కుమారుడిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ డీఆర్​సీ మల్టీప్లెక్స్​లో సోమవారం జరిగింది.

హరికృష్ణన్​ చిత్రపటంతో తల్లిదండ్రులు, సోదరుడు
కుమారుడి ఫొటోతో సినిమా చూస్తున్న తల్లిదండ్రులు
హరికృష్ణన్​ చిత్రపటంతో సినిమా చూస్తున్న తల్లిదండ్రులు, సోదరుడు

పునీత్​ రాజ్​కుమార్​ అభిమాని..

మైసూర్​లోని కువేంపు నగర్​లో నివసించే మురళీధర్ ​కుమారుడు హరికృష్ణన్.. ప్రముఖ కన్నడ నటుడు పునీత్​ రాజ్​కుమార్​కు వీరాభిమాని. ఆయన నటించిన యువరత్న చిత్రాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం స్థానిక వరుణ కాలువలో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన హరికృష్ణన్​ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

విషాదంలో మునిగిన ఆ తల్లిదండ్రులు హరికృష్ణన్​కు తీరని కోరికగా మిగిలి పోయిన అతని అభిమాన హీరో చిత్రాన్ని చూసేందుకు సిద్ధమయ్యారు. కుమారుడు ఈ లోకంలో లేకపోయినా.. అతనికి కూడా థియేటర్లో టికెట్​ బుక్​ చేశారు. తల్లిదండ్రులు.. వారి మధ్య తమ కుమారుడి చిత్రపటాన్ని పెట్టుకుని.. తమతో పాటు అతను కూడా చిత్రాన్ని చూస్తున్నాడని భావిస్తూ భావోద్వేగాల మధ్య సినిమాను చూశారు. తల్లిదండ్రులతో పాటు హరికృష్ణన్ సోదరుడు కూడా చిత్రాన్ని తిలకించేందుకు వచ్చారు.

"నా కుమారుడు పునీత్​ రాజ్​కుమార్​కు వీరాభిమాని. తను ఎప్పటినుంచో ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాడు. అందుకే తన చిత్రపటంతో సినిమా చూశాము."

-మురళీధర్​, హరికృష్ణన్​ తండ్రి

పునీత్​ రాజ్​కుమార్​ ట్వీట్​..

ఈ ఘటనపై నటుడు పునీత్​ రాజ్​కుమార్​ స్పందించారు. మురళీధర్​ దంపతులు తమ కుమారుడి చిత్రపటంతో సినిమా చూస్తున్న చిత్రాలు చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. హరికృష్ణన్​ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఇదీ చదవండి :బెదిరింపులకు బెంగాలీలు వెరవరు: జయాబచ్చన్​

ABOUT THE AUTHOR

...view details