Parents killed their son: కొడుకును తల్లిదండ్రులే హత్య చేసి.. మూటగట్టి సైకిల్‌పై ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చేసిన సంఘటన తమిళనాడు మదురై జిల్లాలో జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.
ఏం జరిగింది?
మదురై జిల్లాలోని కారిమేడు పోలీసులకు వైగాయ్ రివర్ సమీపంలో కాలిన మృతదేహం ఉన్నట్లు శుక్రవారం సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో మృతుడు మదురైలోని అరప్పాలయమ్కు చెందిన మనికందన్(42)గా గుర్తించారు. అతనికి భార్య, తల్లిదండ్రులు(మురుగేశన్, క్రిష్ణవేణి) ఉన్నారు. మణికందన్ మద్యానికి బానిసయ్యాడని, రోజూ తాగొచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగేవాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు పోలీసులు.