తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భోజనం పెట్టలేదని.. కూతుర్ని తలపై కొట్టి చంపిన తల్లిదండ్రులు!

Parents Kill Minor Daughter : పిల్లలకు అన్నీ తామై చూసుకునే తల్లిదండ్రులు వారు తప్పు చేసినా కొట్టడానికి ఆలోచిస్తారు. అంత అపురూపంగా పెంచుకుంటారు తమ పిల్లల్ని. అలాంటిది తాను చేయని తప్పుకు ఓ కూతురి ప్రాణాలు తీశారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?

murder
murder

By

Published : Aug 31, 2022, 11:08 AM IST

Parents Kill Minor Daughter : తమకు భోజనం పెట్టలేదని కన్నకూతురినే కడతేర్చారు తల్లిదండ్రులు. ఈ ఘటన చత్తీస్​గఢ్​లోని సుర్గుజా జిల్లా అంబికాపుర్​లో జరిగింది. బాలికను హతమార్చిన తర్వాత తనను మాయం చేసి ఏమి ఎరుగనట్టు పోలిస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేస్ పెట్టారు. ఇదంతా జరిగిన నెలరోజుల తర్వాత ఆ బాలిక తండ్రి ఆమె ఆచూకీ తెలిసిందంటూ పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. అనుమానంతో పోలీసులు అతన్ని విచారించగా, అసలు విషయం బయటపడింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. జూన్​ 28న విశ్వనాథ్​ ఎక్కా అనే వ్యక్తి పనులు ముగించుకుని భోజన సమయానికి ఇంటికి వచ్చాడు. అప్పటికి తన 12 ఏళ్ల కూతురు వంట పూర్తి చేయలేదని ఆగ్రహించిన తండ్రి ఆ పాపను కర్రతో కొట్టాడు. దీంతో ఆమె ఓ బండ రాయిపై పడటంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

ఇదంతా జరుగుతున్నప్పడు పాప తల్లి సైతం ఇంట్లోనే ఉంది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న అడవిలో పూడ్చేసి మరుసటిరోజు దరిమా పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్​ కంప్లైంట్​ పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి పాప కోసం గాలిస్తున్నారు. దాదాపు నెలరోజుల పాటు గాలించినా పాప గురించి ఒక్క సమాచారం అందలేదు. ఆగస్టు 26న పాప తండ్రి పోలీసుల వద్దకు వచ్చి తమ బిడ్డ జాడ దొరికిందని చెప్పాడు. దగ్గరలోనే ఉన్న లిబ్రా అడవుల్లో మృత దేహం లభ్యమైందని, పాప వేసుకున్న దుస్తులు, చెప్పుల ఆధారంగా అది తన కూతురి మృతదేహమే అని గుర్తించామన్నారు. పోలీసులకు వారి మాటలపై సందేహం కలగడంతో వారిని విచారించారు. విచారణలో తల్లిదండ్రులు జరిగిందంతా ఒప్పుకున్నారు. తామే ఆ పాపను హతమార్చారని తేలడంతో పాటు ఆధారాలను కప్పి పోలీసులను తప్పుదారి పట్టించినందుకు వారి పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్​కు తరలించారు.

వందరూపాయలు ఇవ్వలేదని..
తమ వద్దకు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని హతమార్చారు మత్తు పదార్థాలకు బానిసలైన ఇద్దరు దుండగులు. ఈ ఘటన దిల్లిలో జరిగింది. హత్యకు సంబంధించిన సమాచారం అందటంతో పోలీసులు వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవి ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరైన లాల్​ బాబు అనే వ్యక్తిని పట్టుకున్నారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
అసలు ఏం జరిగిందంటే:నసీం ఆలమ్​ అనే వ్యక్తి తన మిత్రుడు తౌకీర్​ అన్సారీతో కలిసి గంజాయి కొనుగోలు చేసేందుకు షాదీపురా ప్లైఓవర్​ వద్దకు వచ్చారు. ఆ సమయంలో నిందితుడు లాల్​ బాబు అతని అనుచరుడు భోమా అక్కడ ఉండటంతో వారిని అడిగారు. అయితే లాల్​ బాబు వంద రూపాయలు డిమాండ్​ చేయగా దానికి నసీం నిరాకరించడంతో అతన్ని హతమార్చారు.

మాట్లాడనందుకు గొంతుకోసి..
తనతో మాట్లాడేందుకు నిరాకరించిందని ఓ యువతి గొంతుకోశాడు 21 ఏళ్ల యువకుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని భదోహి జిల్లాలో జరిగింది. యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని పోలీసులు తెలిపారు. నిందితుడు రాజ్​కుమార్​ గౌతమ్​పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. భదోహి జిల్లా సుర్వాయాలోని రాజ్​కుమార్​ గౌతమ్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో 20 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమెతో మాట్లేందుకు రాజ్​కుమార్​ ప్రయత్నించగా అతని నెంబర్​ను బ్లాక్​లో పెట్టింది ఆ యువతి. దీంతో ఆగ్రహించిన రాజ్​ ఆమె మార్కెట్​కు వచ్చిన సమయంలో గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. గొంతు కోసి పరార్​ అవ్వగా స్థానికుల సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

ఇదీ చదవండి:కోడల్ని వేధించిన అత్తమామలు.. బుల్డోజర్‌తో పోలీసుల ఎంట్రీ.. చివరకు

దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడని చిన్నారి మర్మాంగాలకు వాతలు

ABOUT THE AUTHOR

...view details