తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. సజీవంగా పొలంలో ఖననం.. రక్షించిన రైతు

నవజాత శిశువును భూమిలో పాతిపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. ఈ దారుణం గుజరాత్​లో జరిగింది. శిశువును ఓ రైతు రక్షించాడు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

parents buried child
శిశువును భూమిలో పాతిపెట్టిన తల్లిదండ్రులు

By

Published : Aug 5, 2022, 1:00 PM IST

బతికున్న కుమార్తెను మట్టిలో పాతేసిన తల్లిదండ్రులు

గుజరాత్​ సాబర్​కాంఠాలో దారుణం జరిగింది. అప్పుడే జన్మించిన పసికందును భూమిలో పాతిపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. బాలిక ప్రాణాలతో ఉండగానే ఇలా చేశారు. పొలానికి వెళ్లిన ఓ రైతు బాలిక కదలికను గమనించి బయటకు తీశాడు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాడు. బాలిక తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి శైలేష్, తల్లి మంజును అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:గంభోయ్ సమీపంలోని పొలంలో నవజాత శిశువును పాతిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. అటుగా వెళ్లిన ఓ రైతు పాప కదలికలను గమనించి బయటకు తీసి.. హిమంత్​నగర్​లోని సివిల్ ఆసుపత్రికి తరలించాడు. నిందితులు గాంధీనగర్​కు చెందినవారు. వీరిద్దరూ 15 రోజుల నుంచి గంభోయ్​లో ఉంటున్నారు. శిశువు బొడ్డు కూడా ఇంకా కోయలేదు. దీంతో పాప పుట్టిన వెంటనే పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details