తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడి మృతదేహం ఇచ్చేందుకు లంచం డిమాండ్.. తల్లిదండ్రుల భిక్షాటన

Parents beg for son dead body: బిహార్​లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించారు. రూ.50 వేలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని సదర్ ఆస్పత్రి సిబ్బంది.. బాధితులను బలవంతం చేశారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన బాధితులు.. మృతదేహం కోసం భిక్షాటన చేయడం ప్రారంభించారు. రూ.50 వేలు పోగు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Parents of a youth beg to collect money
శవం ఇచ్చేందుకు లంచం డిమాండ్.. తల్లిదండ్రుల భిక్షాటన

By

Published : Jun 9, 2022, 11:04 AM IST

Updated : Jun 9, 2022, 2:22 PM IST

తల్లిదండ్రుల భిక్షాటన

Parents beg for son dead body: కన్నబిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించారు ఆసుపత్రి సిబ్బంది. రూ.50వేలు ఇస్తేనేగానీ వారి కుమారుడి మృతదేహాన్ని అప్పగించబోమన్నారు. అంత మొత్తం లేని ఆ నిరుపేద తండ్రి డబ్బు కోసం వీధివీధి తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌లోని సమస్తీపుర్‌లో జరిగింది.

భిక్షాటన చేస్తున్న మృతుడి తల్లిదండ్రులు

కుమారుడి మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేయడం వల్ల.. సొమ్ము కోసం ఆ తల్లిదండ్రులు ఊరంతా తిరుగుతూ భిక్షమెత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. "నా కుమారుడు కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అతడు చనిపోయాడని, సమస్తీపుర్‌లోని సర్దార్‌ ఆసుపత్రిలో మృతదేహం ఉంది.. వచ్చి తీసుకెళ్లాలని నాకు ఇటీవల ఫోన్ కాల్‌ వచ్చింది. ఆసుపత్రికి వెళ్తే.. రూ.50వేలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేం చాలా పేద వాళ్లం. అంతమొత్తం ఎక్కడినుంచి తెచ్చేది.." అంటూ మృతుడి తండ్రి మహేశ్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

భిక్షం అడుగుతున్న మృతుడి తండ్రి

Bihar Samastipur parents begging:ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న చాలా మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులే. గత కొన్ని రోజులుగా వారికి జీతాలు సరిగా లేకపోవడం వల్ల ఇలా రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

డబ్బులు ఇస్తున్న స్థానికులు

ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. ఇది అమానవీయ ఘటన అని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ వినయ్‌ కుమార్‌ రాయ్‌ తెలిపారు. అయితే, మహేశ్ కుమారుడి మృతదేహం పోలీసు కస్టడీలో ఉందని, అందువల్లే అప్పగించడం సాధ్యం కాలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Last Updated : Jun 9, 2022, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details