తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాంబే హైకోర్టుకు పరమ్​ వీర్​ సింగ్​

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు వ్యతిరేకంగా.. ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​ వీర్​ సింగ్​.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దేశ్​ముఖ్​పై సీబీఐతో విచారణ జరిపించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు సస్పెన్షన్​కు గురైన పోలీస్​ అధికారి సచిన్ వాజే కారులో మన్​సుఖ్​ హిరేన్​ కలిసి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైంది. ​

Param Bir Singh approaches Bombay High Court seeking CBI probe against Deshmukh
బాంబే హైకోర్టును ఆశ్రయించిన పరమ్​ వీర్​ సింగ్​

By

Published : Mar 25, 2021, 4:30 PM IST

Updated : Mar 25, 2021, 7:45 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. బాంబే హైకోర్టులో ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ పరమ్​ వీర్​ సింగ్ గురువారం వ్యాజ్యం దాఖలు చేశారు.

అంతకుమందు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరమ్ వీర్ సింగ్ బుధవారం ఉపసంహరించుకున్నారు. హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరమ్​ వీర్ సింగ్ వ్యాజ్యం ఇదీ..

హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రతినెలా 100 కోట్లు వసూళ్లను పోలీస్​ అధికారి సచిన్ వాజేకు లక్ష్యంగా పెట్టారని సీఎంకు లేఖ రాశారు పరమ్ వీర్ సింగ్. ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో తన బదిలీని కూడా సవాలు చేశారు. దేశ్​ముఖ్​ ఇంటి సీసీ ఫుటేజీని తక్షణం స్వాధీనం చేసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు.

సీఎంకు దేశ్​ముఖ్​ లేఖ..

మరోవైపు.. ముంబయి మాజీ కమిషనర్ పరమ్ ​వీర్​ సింగ్​ రాసిన లేఖలోని వాస్తవాలపై దర్యాప్తు చేయాలని సీఎం ఉద్ధవ్​కు లేఖ రాశారు హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.

ఏప్రిల్​ 3 వరకు ఎన్​ఐఏ కస్టడీలో వాజే..

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు కేసులో అరెస్టై, సస్పెన్షన్​కు గురైన పోలీస్ అధికారి సచిన్​ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచింది. తనకు ఈ కేసుకూ ఏ సంబంధమూ లేదని న్యాయస్థానం ఎదుట సచిన్​ వాజే నివేదించారు. తనను ఈ కేసులో అన్యాయంగా బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సచిన్​వాజే ఎన్​ఐఏ కస్టడీని కోర్టు ఏప్రిల్​ 3 వరకు పొడిగించింది.

సీసీటీవీ వీడియో కలకలం..

మహారాష్ట్రంలో సంచలనం సృష్టించిన మన్​సుఖ్​ హిరేన్ మృతి​ కేసు మరో మలుపు తిరిగింది. ఓ సీసీటీవీ ఫుటేజీలో మన్​సుఖ్​ హిరేన్​, పోలీస్​ అధికారి సచిన్​ వాజే కలిసి సంచరిస్తున్న వీడియో బహిర్గతమైంది. ముంబయిలోని ఓ ట్రాఫిక్​ జంక్షన్​లో సచిన్​ వాజేకు చెందిన మెర్సిడెస్​ కారు వైపు హిరేన్​ వెళ్లడం, అనంతరం.. హిరేన్​ను తన కారులో వాజే ఎక్కించుకోవడం అందులో కనిపించింది.

సీసీటీవీ ఫుటేజీలో సచిన్​ వాజే, మన్​సుఖ్​ హిరేన్​

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో.. సంబంధిత వాహనం తనదేనని, అంతకు కొద్ది రోజుల క్రితమే అది చోరీకి గురైందని ​మన్​సుఖ్ హిరేన్​.. పోలీసులను ఆశ్రయించారు. అనంతరం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ కేసును కేంద్ర హోం శాఖ ఈ నెల 20న ఎన్​ఐఏకు అప్పగించింది.

ఇవీ చూడండి:

Last Updated : Mar 25, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details