తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టబద్ధమేనా?

సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికల క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టబద్ధమేనా? అని పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని సంఘం సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్-సమాచార సాంకేతిక శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయింది.

Par panel members question legality of new rules for OTT social media platforms
ఆ క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టబద్ధమేనా?

By

Published : Mar 16, 2021, 7:53 AM IST

అంతర్జాలం ద్వారా వినియోగదారులకు నేరుగా అందించే మీడియా సేవలను(ఓటీటీ), సామాజిక మాధ్యమాల వేదికలను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల చట్టబద్ధతను.. పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాలు, స్ట్రీమింగ్, సంస్థలకు సంబంధించి కేంద్రం గత నెల మధ్యంతర మార్గదర్శకాలనూ, డిజిటల్​ మీడియా ప్రవర్తనా నియమావళినీ అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్, ఫేస్​బుక్, ట్విటర్, నెట్​ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర వేదికలు వీటిని అనుసరించాలని పేర్కొంది.

ఈ క్రమంలో సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్-సమాచార సాంకేతిక శాఖల ఉన్నతాధికారులు సంబంధిత పార్లమెంటరీ స్థాయీ సంఘంతో సోమవారం భేటీ అయ్యారు. శశిథరూర్ నేతృత్వంలోని ఈ సంఘం వారికి పలు కీలక ప్రశ్నలు సంధించింది.

ఇదీ చదవండి:పొడవైన రంగోలీ.. పోలింగ్కు​ చూపించే దారి

ABOUT THE AUTHOR

...view details