Panther In Jaipur Residential Area: రాజస్థాన్ జైపుర్లోని మాళవియా నగర్ సెక్టార్7లో ఆదివారం ఉదయం చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఒక ఇంటి మీద నుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. కాలనీలో కొద్దిసేపు భయానక వాతావరణాన్ని సృష్టించింది. చిరుతను చూసిన ప్రజలు.. ఎత్తయిన భవనాలపైకి వెళ్లి వీడియోలు తీశారు.
సమాచారం అందుకున్నఅటవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. చాలాసేపు ప్రయత్నించి అతికష్టం మీద చిరుతను పట్టుకున్నారు. చిరుతను నహర్ఘర్ సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం.. అడవిలో వదిలిపెట్టారు.