దున్నపోతుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు Panipat buffalo badal: రోజూ పచ్చగడ్డి మేయడమే కాకుండా 15 లీటర్ల పాలు గటగటా తాగేస్తుంది. 20 కేజీల క్యారెట్లను కరకరా నమిలేస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం ఆవనూనెతో మర్దన.. వారానికి ఓమారు స్వచ్ఛమైన దేశీ నెయ్యితో విందు. బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా ఇద్దరు సేవకులు.. వెరసి రోజుకు వెయ్యి రూపాయల సగటు ఖర్చు. ఇదీ ఓ దున్నపోతు వైభోగం.
Murrah buffalo Haryana
హరియాణాలోని పానీపత్ సమీప బరోలి గ్రామానికి చెందిన ఆరడుగుల ఈ ముర్రాజాతి దున్న తన యజమాని రవీంద్రకు ఏటా దాదాపు రూ.25 లక్షల సంపాదించి పెడుతోంది. అందుకే ఈ రాచమర్యాదలు. రవీంద్ర దీనికి 'బాదల్' అనే ముద్దుపేరు కూడా పెట్టారు. ఈ దున్న వీర్యానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన డిమాండు ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే రైతులకు ఈ వీర్యం విక్రయించడం ద్వారా రవీంద్ర రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
బాదల్ గెలుచుకున్న మెడల్స్, సర్టిఫికేట్స్ అంతేనా! ఇప్పటికే డజను పోటీల్లో 'బాదల్' విజయం సాధించింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఓ పోటీలో ద్వితీయస్థానంతో రూ.5 లక్షలు గెలిచింది.
ఇవీ చదవండి: