ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న ఓ మహిళ.. అత్తవారింటికి వచ్చిన తీరు స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బదౌన్ ప్రాంతానికి చెందిన సునీత వర్మా.. సోమవారం ఆమె అత్తవారి గ్రామం అయిన అలంపుర్ కోట్కు హెలికాప్టర్లో చేరుకున్నారు. సునీత.. ఇటీవల అలంపుర్ కోట్ గ్రామ సర్పంచిగా కూడా ఎన్నికయ్యారు. కొత్త సర్పంచ్‌ను గ్రామస్థులు స్వాగతించారు.
బదౌన్ గ్రామానికి చెందిన వేద్రామ్ లోధీ కుమార్తె అయిన సునీత వర్మా.. అలంపుర్కు చెందిన ఒమేంద్ర సింగ్‌ను గత ఏడాది డిసెంబరులో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేయగా ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.