తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలవోకగా 'లా'.. ఒకేసారి 11 గోల్డ్​ మెడల్స్​తో పల్లవి సత్తా.. చూపు లేకపోయినా..

లా కోర్సులో 11 గోల్డ్​ మెడల్స్ సాధించి ఔరా అనిపించారు హిదాయతుల్లా లా వర్సిటీ విద్యార్థిని పల్లవి మిశ్ర. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. విదేశీ కంపెనీలు రూ.కోటి వేతనం ఇస్తామని చెప్పినా.. దేశసేవ చేసేందుకు ఇక్కడే ఉండిపోతున్నట్లు చెప్పారు. మరోవైపు, ఇదే వర్సిటీకి చెందిన మరో విద్యార్థిని.. కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్ సాధించారు.

pallavi-mishra
pallavi-mishra

By

Published : Jul 31, 2022, 7:01 PM IST

ఈటీవీ భారత్​తో పల్లవి మిశ్ర

ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని పల్లవి మిశ్ర చదువులో సత్తా చాటారు. బీఎ ఎల్ఎల్​బీ కోర్సులో 11 గోల్డ్ మెడల్స్ సాధించారు. లా డిగ్రీ కోర్సులో భాగంగా నిర్వహించిన ఆరు సెమిస్టర్లలో పల్లవి టాపర్​గా నిలిచారు. మొత్తంగా 7కు 6.2సీజీపీఏ పాయింట్లు సాధించి యూనివర్సిటీలో తొలిస్థానం సంపాదించారు. యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.

తొలి ర్యాంకు సాధించడం, అధిక సీజీపీఏ సాధించినందుకు రెండు గోల్డ్ మెడల్స్.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ లా వంటి పలు సబ్జెక్టుల్లో ప్రతిభ కనబర్చినందుకు మరికొన్ని బంగారు పతకాలను పల్లవి కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​తో మాట్లాడిన పల్లవి.. తన కుటుంబానికి, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం ఎనలేనిదని చెప్పారు.

ఇదీ చదవండి:'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'

దిల్లీలో అడ్వకసీని ప్రారంభిస్తానని పల్లవి మిశ్ర పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు, కార్పొరేట్, సొసైటీ లిటిగేషన్లపై దృష్టిసారిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టుల్లో పెండింగ్ కేసులపై మాట్లాడారు. దేశంలో చట్టాలు బాగానే ఉన్నా.. వాటి అమలులోనే సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కొన్నిసార్లు చిన్న కేసులు కూడా కోర్టుల వరకు వస్తున్నాయని.. పౌరులకు అవగాహన కల్పిస్తే ఇవి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతాయని చెప్పారు.

అంతకుముందు కేంబ్రిడ్జ్​లోనూ కార్పొరేట్ లాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు పల్లవి. ఏడాది కోర్సును కొద్దిరోజుల క్రితమే పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అక్కడ చాలా అంశాలను నేర్చుకున్నట్లు చెప్పారు. 'క్యాంపస్ సెలక్షన్లలో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. రూ.18 లక్షల ప్యాకేజీ ఇస్తామని సంస్థలు ఆఫర్ చేశాయి. కానీ, కేంబ్రిడ్జిలో మాస్టర్స్ చేయడమే ముఖ్యమని అనుకున్నా. అక్కడ రెండు గోల్డ్ మెడల్స్ సాధించా. లండన్​లోని ఓ కంపెనీ నాకు రూ.కోటి ఆఫర్ ఇచ్చింది. కానీ, దేశం కోసమే పనిచేయాలని అనుకున్నా. అందుకే దాన్ని రిజెక్ట్ చేశా. ఇకపై దిల్లీలోనే పనిచేస్తా' అని అన్నారు పల్లవి.

'సీజేఐ సర్ బాగా మాట్లాడారు'
సీజేఐ చేతుల మీదుగా మెడల్స్ స్వీకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు పల్లవి మిశ్ర. "స్టేజీపైకి వెళ్లేందుకు కాస్త భయంగా అనిపించింది. కానీ, సీజేఐ సర్ చాలా బాగా మాట్లాడారు. 'ఇప్పుడు ఏం చేస్తున్నారు?' అని నన్ను అడిగారు. 'తర్వాతి ప్లాన్స్ ఏంటి?' అని అడిగారు. ఆయన చేతుల మీదుగా అవార్డులు స్వీకరించడం చాలా గొప్ప అనుభూతి" అని పల్లవి పేర్కొన్నారు.

చూపు లేకున్నా...
మరోవైపు, ఇదే యూనివర్సిటీలో యవనిక అనే విద్యార్థిని.. చూపు లేకపోయినా గోల్డ్ మెడల్​ సాధించి ఔరా అనిపించారు. ప్రొఫెషనల్ ఎథిక్స్​లో టాపర్​గా నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. సీజేఐ సమక్షంలో మెడల్ అందుకున్నారు. యవనిక తండ్రి ఇండియన్ రైల్వేలో అధికారిగా పనిచేస్తున్నారు. తల్లి స్పెషల్ ఎడ్యుకేటర్​. కళ్లు కనిపించకపోయినా.. ఎప్పుడూ దాన్ని వైకల్యంగా అనుకోలేదు యవనిక.

తల్లిదండ్రులతో యువనిక

లా చదవాలని యువనిక నిర్ణయం తీసుకోగానే.. ఆమె తల్లి తన వృత్తికి విరామం ఇచ్చారు. ఐదేళ్లు తన కూతురి వెంటే ఉన్నారు. బ్యాచిలర్ డిగ్రీలో పట్టా సాధించిన యువనిక.. ఇప్పుడు మాస్టర్స్ చదివేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ లా కాలేజీలో ఎల్ఎల్ఎం అడ్మిషన్ తీసుకున్నారు. ఐదేళ్ల ప్రయాణంలో తోటి విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది చాలా సహకారం అందించారని యువనిక తెలిపారు.

ఇదీ చదవండి:రెచ్చిపోయిన అమ్మాయిలు.. జుట్లు పట్టుకొని ఫైట్.. బాయ్​ఫ్రెండ్ కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details