Palghar Murder News: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా వాసాయి మండలంలో దారుణం జరిగింది. విడిపోయిన తన భార్యను ప్రేమించిన వ్యక్తిని గొంతు కోసి హత్య చేసాడో వ్యక్తి. నిందితున్ని కిరణ్ హింగాగా (29) గుర్తించారు. బాధితుడ్ని దినేష్ రౌటేగా (39) గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
"హింగా వాసాయిలో నివసిస్తున్నాడు. అతని భార్య వదిలి వెళ్లిపోయింది. ఆమె తన సహచరుడైన రౌటేను ప్రేమించి అతనితోనే కలిసి ఉంటోంది. ఇంటికి తిరిగి రావాలని భర్త ఆమెను పలుమార్లు అభ్యర్థించినప్పటికీ నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన హింగా.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రౌటే ఇంటికి వెళ్లి గొంతుకోసి చంపాడు." అని పోలీసులు తెలిపారు.