ఝూర్ఖండ్ పాలమూలో దారుణం జరిగింది. భర్త కళ్లెదుటే ఓ మహిళపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాత్‌బర్వా పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం జరిగిందీ ఘటన. అత్యాచార నిందుతులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే.. సాత్‌బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాధితురాలు.. భర్తపై కోపంతో లాతేహర్లోని తన పుట్టింటికి బయలుదేరింది. దీంతో తన భార్యను వెతుక్కుంటూ ఆమె భర్త బైక్‌పై సాత్‌బర్వా ప్రాంతానికి చేరుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తున్న భార్యను గమనించి.. ఇంటికి తిరిగిరావాలంటూ బతిమాలాడు. అదే సమయానికి బాధితురాలి బావ కూడా అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరు కలిసి బాధితురాల్ని నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆరుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురిని స్టోన్క్రషర్వైపు బలవంతంగా లాక్కెళ్లిపోయారు. బాధితురాలి భర్త, బావను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితురాలి బావ స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం మహిళపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులందరినీ అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
భార్యపై అనుమానంతో..
మరోవైపు, భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అసహజ శృంగారానికి పాల్పడుతుండడమే కాకుండా.. ఆమె ప్రైవేట్ భాగాలకు వేడి కత్తిని అంటించి.. పై నుంచి గమ్‌ను పోశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని షిప్రా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్‌రేప్..
దిల్లీలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలుడిని నలుగురు వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈశాన్య దిల్లీలో సెప్టెంబరు 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. అత్యాచారం అనంతరం.. బాలుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. బాధితుడి ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడ్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.