తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాక్ మహిళ అరెస్టు - ఉత్తర్​ప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ

ఉత్తర్​ప్రదేశ్​ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుతో జనవరి 1 ఆమెపై ఎఫ్​ఐఆర్​ నమోదు కాగా అప్పటినుంచి ఆమె పరారీలో ఉంది.

Pakistani woman arrested after becoming panchayat head in UP
ఆ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ మహిళ అరెస్టు

By

Published : Feb 16, 2021, 10:20 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాకిస్థానీ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

బానో బేగం అనే పాకిస్థానీ మహిళ.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటాకు చెందిన అక్తర్​ అలీని 1980లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వీసాపై భారత్​లోనే నివసిస్తోంది. వీసా గడువుతీరిన ప్రతిసారి పునరుద్ధరించుకుంటూ ఇక్కడే ఉంటోంది. అయితే గదవ్​ గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. గ్రామ సర్పంచ్​ చనిపోవడం వల్ల ఆ పదవి దక్కించుకోవాలని ప్రయత్నించింది. దాంతో గ్రామస్థులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఆమెపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. శనివారం బానోను ఆమె ఇంటికి సమీపంలో అరెస్టు చేశామని జలేసర్​ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:'ఆ 2.5 లక్షల మందిపై కేసులు ఎత్తేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details