జమ్ముకశ్మీర్లో స్థానిక ఎన్నికల్లో మాజీ ఉగ్రవాది భార్య పోటీ చేస్తున్నారు. కుప్వారా జిల్లాలో తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో జిల్లా అభివృద్ధి మండలి(డీసీసీ) బరిలోకి దిగుతున్నట్లు స్వతంత్ర అభ్యర్థి సౌమ్య సదా పేర్కొన్నారు. ఆమెతో పాటు ఆ స్థానంలో మరో 11 మంది మహిళలు పోటీ పడుతున్నారు. శుక్రవారం జరుగుతున్న మూడో విడత పోలింగ్లో ఆమె తలపడుతున్నారు.
"ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కేవలం నా అభిప్రాయమే కాదు మహిళలందరి ఉద్దేశం. మహిళల ప్రతినిధిగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే నా లక్ష్యం. వారు తమ కాళ్లపై నిల్చొనేలా చేసి.. నిరుద్యోగితను పారదోలడానికి అందరితో కలిసి పని చేయలన్నదే నా ఆశయం."